స్వంతంగా పేదలకు బియ్యం పంపిణీ: కార్పోరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్.

0
231

ఆల్విన్ కాలని డివిజన్ పరిదిలోని ఎల్లమ్మబండ గణేష్ నగర్ కాలనిలోని పేద ప్రజలకు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు ఈ రోజు స్వంతంగా సూమారు 150 మందికి బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా కార్పరేటర్ గారు మాట్లాడుతూ ఆల్విన్ కాలని డివిజన్ పరిధిలో ఆకలితో ఎవ్వరూ అలమటించకూడదనే ఉద్దేశంతో ఎక్కడ పేదప్రజలు ఉన్నా అక్కడికి వెళ్ళి స్వంతగా బియ్యం, కూరగాయలు అందిస్తున్నామని తెలిపారు.కరోనా నివారణకు కూడా ఎప్పటికప్పుడు శానిటేషన్ సిబ్బందితో కలిసి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో యస్.ఐ లింగం, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, వార్డ్ సభ్యులు చిన్నోల్ల శ్రీనివాస్, నాయకులు శివరాజ్ గౌడ్, యాంజాల యాదన్న,నాగభూషణంయాదగిరి, మారుతి, రాంచందర్, అరివె రవి, శ్యామ్, వాసు గారితో పాటు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.