లాక్ డౌన్ నేపథ్యంలో శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బాపు నగర్ లో ముస్లిం మైనార్టీ లతో పాటు వలస కూలీలు, పేద కుటుంబాలకు స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారి స్వంత ఖర్చులతో కొనుగోలు చేసిన నిత్యావసర సరుకులను గురువారం బాపు నగర్ లో వార్డు మెంబర్ ఫర్వీన్, ముంతాజ్ అందజేశారు. లాక్ డౌన్ లో పేదలెవరూ ఆకలితో అలమటించరాదని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రత్యేక చొరవ చూపి బియ్యం, పప్పు, నూనె తదితరులు నిత్యావసర సరుకులను అందజేశారు. డివిజన్ పరిధిలో ఏ ఒక్కరూ ఇబ్బందులు పడరాదని, అందరూ ఇళ్లలోనే ఉండి కరోనా మహమ్మారి ని కట్టడి చేయాలని ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సూచించారు.
తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్,
బ్యూరో చీఫ్,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.