స్వంత నిధులతో 5000 గుడ్లు, 1000 బిర్యానీ ప్యాకెట్లను పేదలకు పంపిణీ: యంపి. డాక్టర్ శ్రీ గడ్డం రంజిత్ రెడ్డి గారు.

0
152

ఈరోజు చేవెళ్ల నియోజకవర్గం లోని చేవెళ్ల పట్టణంలో పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి. రంజిత్ రెడ్డి గారు తన సొంత నిధులతో సుమారు 5వేల గ్రుడ్లు మరియు 1000 బిర్యానీ ప్యాకెట్లను నిరుపేదలకు స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య గారు, స్థానిక సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ లతో కలిసి అందజేశారు.

ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి గారు మాట్లాడుతూ… లాక్ డౌన్ నేపథ్యంలో ఏ ఒక్కరూ కూడా ఆకలితో భాధ పడకూడదని కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు తన వంతు సహాయంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
చికెన్ మరియు గుడ్లను తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తను మొదటి నుండి చెపుతున్నాని, చివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అదే విషయాన్ని తెలిపిందన్నారు.అందుకే తాను నిత్యావసర సరుకులతోపాటు గుడ్లను కూడ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి,
బ్యూరో చీఫ్ &ఇంచార్జి,
సౌత్ ఇండియా,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.