హైదర్ నగర్ డివిజన్ లో యువకులు, మహిళలు బిజెపి పార్టీలో చేరిక.
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హైదర్ నగర్ డివిజన్ శ్రీ రాం నగర్ లో బీజేవైఎం రాష్ట్ర నాయకులు జి అరుణ్ కుమార్ సమక్షంలో డివిజన్ అధ్యక్షులు నవీన్ గౌడ్ అధ్యక్షతన శ్రీరామ్ నగర్ బస్తీకి చెందిన స్థానిక యువకుడు బాలకృష్ణ ఆధ్వర్యంలో 50 మంది యువకులు, మహిళలు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఇష్టపడి పార్టీలో చేరడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ తో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు నరేష్, యోగనంద్, మొవ్వ సత్యనారాయణ,బిజెవైఎం జాతీయ నాయకులు నరేందర్ రెడ్డి,జిల్లా కార్యదర్శి కేశవ రావు పాల్గొని యువకులకు మరియు మహిళలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ సీనియర్ నాయకులు ఎల్లేష్ ముదిరాజ్, వేణు యాదవ్, వెలగ శ్రీనివాస్, బలెదె వెంకట్, చక్రధర్, చందు, కరుణాకర్, సాయి మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL