ప్రజలు వినక పోతే ఆర్మీని దించాల్సి వస్తుంది
ప్రజలు పోలీసులకు సహకరించకపోతే, ఆర్మీని రంగంలోకి దించాల్సి వస్తుంది.💥💥
💥 కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి, అందరూ జాగ్రత్తగా సహకరించి అలాంటి పరిస్థితులు *రాకుండా చూడాలని ప్రజలను కోరుతున్నాను.
అప్రమత్తతే మనల్ని *కాపాడుతుంది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు కవులు మంచి కవితలు రాయాలని *కోరుతున్నాను…
💥 నియంత్రణ విషయంలో పోలీసులు, అధికారులు మాత్రమే కనిపిస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఎటు పోయారు? జీహెచ్ఎంసీలో 150 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వాళ్లంతా ఎటు పోయిండ్రు? అది మంచిది కాదు. అందరూ రంగంలోకి దిగాలి.
💥 పోలీసులను, అధికారులను సమన్వయం చేస్తూ ప్రజాప్రతినిధులందరూ పనిచేయాలి.
💥 ఒక్క పోలీసులదే బాధ్యత అంటే సరికాదు, ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు… ఇలా అందరూ బాధ్యత తీసుకోవాలి. ప్రజలకు అవగాహన కల్పించాలి. పోలీసులతో పాటు మనం కూడా 24 గంటలూ పనిచేయాలి.
💥 రాష్ట్ర సరిహద్దుల దగ్గర దాదాపు 3400 వాహనాలు నిలిచిపోయాయి. ఆ వాహనాలకు ఇవాళ ఒక్కరోజు టోల్ ఛార్జీలు రద్దు చేసి వదిలేస్తున్నాం.
💥 ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉంటే 104 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలి. వెంటనే ప్రభుత్వం మీకు సాయం చేస్తుంది. రైతులు కూడా పట్టణాలలో ఉన్న మార్కెట్లకు రావద్దు. తమతమ ఊర్లలోనే వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం..
💥 ఎక్కువ ధరలకు సరకులు, కూరగాయలు అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసు పెట్టి, మీ దుకాణాల లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేస్తాం తర్వాత మీరు ఎంత మొత్తుకున్నా ఫలితం ఉండదని హెచ్చరించారు.
Nalla Sanjeeva Reddy
Chief Bureau
SOUTH INDIA
NAC NEWS CHANNEL
