124 డివిజన్ లో MLA & ప్రభుత్వ విప్ శ్రీ అరెకపూడి గాంధీ గారు, కార్పోరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు బియ్యం పంపిణీ

0
169

శేరిలింగంపల్లి నియోజక వర్గంలోని 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు డివిజన్ లోని పేద ప్రజలు గాని వలస కూలీలు కానీ ఎవ్వరు కూడా ఆకలితో అలమటించకూడదు అనే ఉద్దేశంతో ప్రతిరోజు వందల కుటుంబాలకు తన సొంత ఖర్చుతో బియ్యం పంపిణీ చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గౌరవనీయులు శ్రీ అరికెపూడి గాంధీ గారి చేతుల మీదుగా ఎల్లమ్మ బండ మహావీర్ నగర్ లోని 100 కుటుంబాలకు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో దొడ్ల రామకృష్ణ గౌడ్, వార్డ్ మెంబర్ చిన్నోళ్ళ శ్రీనివాస్, కాశీనాథ్ యాదవ్, శివరాజ్ గౌడ్, హరీష్, వీరేశం, నారాయణ, మల్లేష్, రామస్వామి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.