National Anti Corruption News Channel

0
587

Serilingampally June 07: రాబోయే రోజుల్లో కరోనా మహమ్మారి విలయతాండవం చేయనుందని ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ కరోనా నుంచి కాపాడుకోవాలని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సూచించారు. ఆదివారం డివిజన్ పరిధిలోని శేరినల్లగండ్ల కూరగాయల మార్కెట్ లో పర్యటించారు. కరోనా నేపథ్యంలో కూరగాయల వ్యాపారులు, ప్రజలు పాటించాల్సిన నియమనిబంధనలను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ వివరించారు. మాస్క్ లు తప్పనిసరిగా వాడాలని, భౌతికదూరం పాటిస్తూ కూరగాయల క్రయవిక్రయాలను సాగించాలన్నారు. మార్కెట్ కు వెళ్లే ప్రవేశ ద్వారాల వద్ద సానిటైజర్లను తప్పకుండా ఉంచాలని మార్కెట్ కమిటీ వారికి రాగం నాగేందర్ యాదవ్ సూచించారు. మార్కెట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ డివిజన్ గౌరవాధ్యక్షుడు, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, ప్రధాన కార్యదర్శి ఖాజాపాషా తో పాటు ప్రభాకర్ రెడ్డి, బుచ్చిరెడ్డి, ఎస్ ఆర్ పీ భరత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Nalla Sanjeeva Reddy
Bureau Chief
Telangana State
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here