2వ రోజు బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 575 నిత్యావసరాల కిట్లను వేముకుంట బస్తి వాసులకు పంపిణీ చేసిన చైర్మన్ బొబ్బ విజయ రెడ్డి.
దివ్యాoగులకు,వృద్దులకు స్వయంగా వారి ఇంటిoటికి వెళ్లి నిత్యావసరాల కిట్లను అందచేసిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.
చందానగర్ డివిజన్ వేముకుంట బస్తి వాసులకు అలీఫా హై స్కూల్ లో నాయకులు మరియు ట్రస్ట్ చైర్మన్ బొబ్బ విజయ్ రెడ్డి తో కలిసి నిత్యావసరాల కిట్లను పంపిణీ చేసిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.
కార్పొరేటర్ మాట్లాడుతూ వేముమంట బస్తి లో అలీఫా స్కూల్ లో నాయకులు ఉస్మాన్ బేగ్ , కోమండ్ల శ్రీనివాస్ రెడ్డి,పర్నంది శ్రీకాంత్,విజయ్ భాస్కర్ రెడ్డి, వెంకటేశం,గుడ్ల ధనలక్ష్మి ,ట్రస్ట్ డైరెక్టర్ బొబ్బ దామోదర్ రెడ్డి గార్ల తో కలిసి 560 నిత్యావసరాల కిట్లను పంపిణీ చేయటం జరిగినది అని,వేముకుంటలో ఎక్కువ 75% మైనారిటీ సోదరులు ఉన్న బస్తి కాబట్టి రంజాన్ పండుగ సందర్భంగా వారు ఇబ్బంది పడకూడదు అని ఉద్దేశం తో ఈ నిత్యావసరాల కిట్లను పంపిణీ చేసాం అని, అలాగే వేముకుంట బస్తిలో నడవలేని దివ్యాoగులకు మరియు ఎండకు తట్టుకోలేక నిలబడలేని వృద్దులకు మొత్తం 15 మంది దివ్యాoగులకు,వృద్దులకు స్వయంగా వారి ఇంటిoటికి వెళ్లి నిత్యావసరాల కిట్లను కార్పొరేటర్ అందచేయటం జరిగినది.
ఈ కార్యక్రమంలో సురేందర్,భవాని,రాణి,సురేష్,నవీన్,మనోజ్,సాయి,తదితరులు పాల్గొన్నారు