4వ రోజు బొబ్బ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా 120 నిత్యావసరాల కిట్లను న్యూ పి. ఏ నగర్ బస్తీ వాసులకు పంపిణీ చేసిన చైర్మన్ బొబ్బ విజయ రెడ్డి.

0
238

శేరిలింగంపల్లి, మే 14: దివ్యాoగులకు, వృద్దులకు స్వయంగా వారి ఇంటికి వెళ్లి నిత్యావసరాల కిట్లను అందచేసిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

చందానగర్ డివిజన్ న్యూ పి. ఏ నగర్ బస్తి వాసులకు నాయకులు మరియు ట్రస్ట్ చైర్మన్ బొబ్బ విజయ్ రెడ్డి తో కలిసి నిత్యావసరాల కిట్లను పంపిణీ చేసిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

కార్పొరేటర్ మాట్లాడుతూ… న్యూ పి. ఏ నగర్ బస్తి లో 120 నిత్యావసరాల కిట్లను పంపిణీ చేయటం జరిగినది అని, లాక్ డౌన్ వలన బస్తి వాసులు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు అని ఉద్దేశం తో ఈ నిత్యావసరాల కిట్లను పంపిణీ చేసాం అని, అలాగే న్యూ పి. ఏ నగర్ బస్తి లో నడవలేని దివ్యాoగులకు, వృద్దులకు, స్వయంగా వారి ఇంటికి వెళ్లి నిత్యావసరాల కిట్లను కార్పొరేటర్ అందచేయటం జరిగినది అని చెప్పటం జరిగినది..

ఈ కార్యక్రమంలో పార్నంది శ్రీకాంత్, బిట్ల శ్రీకాంత్ రెడ్డి రమనకుమారి, గౌస్ జీతయ్య, రామచందర్, పి.వై.రమేష్, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు

ఎన్ నాగ రవళి
తెలంగాణ స్టేట్
ఆఫీసు ఇంచార్జి
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here