4వ రోజు వరద బాధితులకు ఆర్ధిక సాయం.. వి.జగదీశ్వర్ గౌడ్..

0
258

శేరిలింగంపల్లి, అక్టోబర్ 23: మాదాపూర్ డివిజన్ పరిధిలోని వరద బాధితులకు టిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ.కేసీఆర్ గారి సూచనల మేరకు, గౌరవ మున్సిపల్ శాఖమంత్రివర్యులు శ్రీ.కేటీఆర్ గారి ఆదేశాల మేరకు వరద బాధితులకు ఒక్కో కుటుంబానికి రూ.10,000 చొప్పున ఆర్ధిక సాయం అందించడం జరుగుతుందని తెలిపారు. గురువారం సాయంత్రం మరియు శుక్రవారం ఉదయం మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ చంద్ర బోస్ నగర్ బస్తీలో ముంపు ప్రభావిత కుటుంబాలను పరామర్శించి, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ.కేసీఆర్ గారు ప్రకటించిన పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబాలను కలిసి వారికి స్వయంగా జి.హెచ్.ఎం.సి ఏ.ఈ ప్రశాంత్, రెవెన్యూశాఖ అధికారులు ఆనంద్, రాజశేఖర్ గారితో కలిసి అందించారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్..

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here