6వ రోజు పేదలకు భోజనాలు సమకూర్చిన దాతలు:జగదీశ్వర్ గౌడ్ కార్పోరేటర్.

0
346
 1. 6 వ రోజు కరోనా వైరస్ వల్ల పేద ప్రజల ఆకలి తీరుస్తున్న దాతలకు ధన్యవాదాలు
  శ్రీ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
  ఈరోజు హఫీజ్ పేట్/మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్,ఓల్డ్ హఫీజ్ పేట్,గోకుల్ ప్లాట్స్ నందు 150 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు ప్రజలకు చేరే విధంగా చూడాలని కార్పొరేటర్ గారు స్థానిక నాయకులకు అందించారు..
  మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ నందు గంప సత్యనారాయణ గుప్త,ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో సుమారు 120 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను కార్పోరేటర్ గారి చేతుల మీదుగా అందించారు..
  కార్పోరేటర్ గారు మాట్లాడుతూ..
  పేద ప్రజలకు,రోజు కూలి చేసుకొని బ్రతికే ప్రజలకు కరోనా వైరస్ వల్ల రోజు తినడానికి తిండి లేక ఎంతో ఇబ్బందులు  పడుతున్నవారికి తోడుగా,అండగా ఎంతో మంది వారికి తోచిన విధంగా బోజనాలను ఏర్పాటు చేస్తున్నారని,వారందరికీ ధన్యవాదాలు తెలిపారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు…
  6 వ రోజు నిత్యం లాగే దాతలు ముందుకు వచ్చి సుమారు 1500 మంది పేద ప్రజల ఆకలి తీరుస్తున్నారని తెలిపారు..
  ఈ రోజు దాతలు టిఆర్ఎస్ యువ నాయకులు శ్రీ.జేరిపాటి రాజు గారు భోజన పొట్లాలను మరియు కోవిడ్ 19 హెల్ప్ డెస్క్ (ఐ.టి)టీమ్,యాక్టర్ మరియు చరకోల్ రెస్టౌరెంట్ ఓనర్ శ్రీ.జీవన్ గారు బోజనాలను ఏర్పాటు  చేసారు..
  మాదాపూర్ డివిజన్ పరిధిలో అనేక చోట్ల నిత్యం లాగే 500 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిిగింది ,దాతలు అందించిన ఆహార పొట్లాలను మరియు భోజనాలను మాదాపూర్ డివిజన్ పరిధిలో అనేక చోట్లలో ప్రజలకు స్థానిక టిఆర్ఎస్ నాయకులు అందించారు..
  సుభాష్ నగర్ కార్యక్రమంలో సాంబశివరావు,ముఖ్తర్,రామకృష్ణ,రాములు యాదవ్,శివ గౌడ్,రహీం,హసన్,యాదగిరి,నర్సింహ,వీరేశం,రెహ్మాన్ పాల్గొన్నారు.

ప్రజలకు భోజనం అందించిన కార్యక్రమంలో జయరాజ్ యాదవ్,కృష్ణ యాదవ్,అజిజ్,శ్యామ్,నాగ్ మహేష్,రాము,షైబజ్,నర్సింగరావు,సార్వార్,మహేష్,చోటేమియా,నాయిమ్,కృష్ణ నాయక్,కృష్ణా తైలి,షేకిల్,తైలి గిరి,విజయ్ లక్ష్మీ,రాణి గారు తదితరులు పాల్గొన్నారు..

 

Telangana
Nalla Sanjeeva Reddy
Bureau Chief
South India
NAC NEWS CHANNEL.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here