BSR TRUST అధ్యక్షులు బూసిరెడ్డి శంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 7వరోజు అన్న ప్రసాదం…

0
181

ఆపద సమయంలో అన్నదానమే మహాదానం
భద్రాచలం ఏఎస్పీ శ్రీ.రాజేష్ చంద్ర IPS నేటి ముఖ్య అతిధి:..

భద్రాచలం ఏఎస్పీ శ్రీ.రాజేష్ చంద్ర IPS గారిచే నేటి ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది..

203 ప్రపంచదేశాలతో పాటుగా భారతదేశంలో కూడా కరోనా మహామ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజాలెవ్వరూ కరోనా బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు
అనేక చర్యలు చేపడుతున్న నేపధ్యం లో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన సమయం కంటే ముందుగానే శ్రీసీతారాముల కళ్యాణం చూద్దామని వచ్చిన భక్తులు, వలస కార్మికులు, యాచకులు అనేకమంది నిరాశ్రయులై ఆకలితో అలమటిస్తూ తినడానికి తిండి ..ఉండడానికి గూడు లేక విల విల లాడుతున్న నేపధ్యం లో తన తండ్రి గారైన కీ.శే.బూసిరెడ్డి సీతారామిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి నిరాశ్రయ నిర్వాసితులకు తన బి యస్ ఆర్ గార్డెన్స్ నందలి అన్నపూర్ణా ఫంక్షన్ హాలు నందు ఉచిత వసతి, అల్పాహారం తో పాటుగా రెండు పూటలూ భోజన సౌకర్యాలు కల్పించడం పరమపుణ్యం అని, అన్నిదానాల్లోకి అన్నదానం మిన్న అని, ఈ విపత్కర సమయం లో అన్నదానమే మహాదానమని *భద్రాచలం ఏ ఎస్పీ శ్రీ.రాజేష్ చంద్ర IPS గారు*
డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డిని అభినందించారు.
ఆ తరువాత అక్కడ ఆశ్రయం పొందుతున్న వారికే పట్టణంలోని వివిధ ప్రాంతాలనుండి అక్కడకు వచ్చి వేచి ఉన్న అన్నార్తులకు కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకుగాను తీసుకోవాల్సిన జాగ్రత్తలు స్వయం నియంత్రణ పాటించాల్సిందిగా ఉద్బోధించారు మరియు యు.కె కాడ ఉన్న అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మాస్కులు అందజేశారు ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించాలి అని పేర్కొన్నారు కరోన మహమ్మారి విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడున్న నిరాశ్రయుల కు ఉద్బోధించారు

నేటి కార్యక్రమంలో స్థానిక తహసీల్దారు, పట్టణ సర్కిల్ ఇనస్పెక్టర్ శ్రీ. వినోద్ రెడ్డి గారు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, రూపా స్కూలు అధినేత శ్రీ.పచ్చినీలం మునికేశవ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ ఆపదసమయం లో ఉచిత భోజన, వసతి సేవలందిస్తున్న డా.బూసిరెడ్డి కి మేము సైతం అంటూ ఈ రోజు అన్నదానంకు అయ్యే ఖర్చుకు ఆర్ధికంగా చేయూత నిచ్చి తమ వంతు సహకరించిన నేటి దాతలు మానవతా మూర్తులు, భద్రాచలం పట్టణానికి *రోటరీ క్లబ్ నాయకులు రొటేరియన్ ఐటీసీ కాంట్రాక్టర్ మహమ్మద్ రఫీ, భద్ర మారుతీ సూపర్ మార్కెట్ అధినేత గుడికందుల నాగేశ్వర రావు, శ్రీకోమలి స్కూలు అధినేత పలివేల రవికుమారు లను* మరియు నిన్న సాయంత్రం భోజన వితరణకు సహకరించిన
మరియు వారి కుటుంబ సభ్యులను డా.బూసిరెడ్డి శంకర్ రెడ్డి అభినందించారు.. ఇటువంటి మంచి మనసున్న దాతలను భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారు వారి వారి కుటుంబాలను ఎల్లవేళలా ఆయుష్షు ఆరోగ్యం ఐశ్వర్యం లతో పాటు సుఖ సంతోషాలతో ఆశీర్వదించాలని డాక్టర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి అభిలాషించారు..

అన్నపూర్ణా ఫంక్షన్ హాలు నందు వసతి పొందుతూ హాలు లొనే తలదాచుకుంటున్న వారికి మరియు బయటినుండి పట్టణం లోని వివిధ ప్రాంతాల నుండి హాలు వద్దకు వచ్చి వేచి ఉన్న నిస్సహాయ నిరాశ్రయులకు, పార్సిల్ చేసి సిద్ధంగా ఉంచిన 300 అన్నప్రసాద వితరణ పాకెట్స్ ను ఈరోజు అన్నపూర్ణా ఫంక్షన్ హాలు వద్ద పంచడం జరిగింది,..మరికొన్ని అన్నప్రసాద భోజన పాకెట్లు భద్రాచలం లోని గోపాలకృష్ణ థియేటర్ పక్క సందులో ని స్లమ్ ఏరియాలో 40 మంది నిస్సహాయులకు పంపిణీ చేసారు.

Nalla Sanjeeva Reddy
Bureau Chief
South India
NAC NEWS CHANNEL..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here