HMWSSB త్రాగునీరు వదిలే లైన్ మెన్లకు మరియు సీవరేజ్ కార్మికులకు నిత్యావసరాల సరుకులు పంపిణీ చేసిన కార్పోరేటర్ బొబ్బ నవత రెడ్డి

0
195

(HMWSSB) త్రాగు నీరు వదిలే లైన్ మెన్లు మరియు సీవరేజ్ కార్మికులకు నిత్యావసరాల సరకులను అందచేసిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

చందానగర్ డివిజన్ లో పని చేసే (HMWSSB) త్రాగు నీరు వదిలే లైన్ మేన్స్ కి మరియు సీవరేజ్ కార్మికులకు నిత్యావసరాల సరకులను అందచేసిన ట్రస్ట్ డైరెక్టర్ మరియు కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

కార్పొరేటర్ మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో కాలనీ/బస్తి/అపార్ట్మెంట్ వాసులకు ఎండాకాలం లో కూడా ఎటువంటి నీటి ఇబ్బంది లేకుండా పని చేసినందుకు అభినందనలు తెలుపుతూ, లాక్ డౌన్ వలన HMWSSB త్రాగు నీరు వదిలే లైన్ మేన్స్ కి మరియు సివరేజ్ కార్మికులు ఇబ్బంది పడకూడదు అని ఉద్దేశం తో బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ నిత్యావసరాల కిట్లను అందచేస్తున్నాం అని,రాబోయే రోజుల్లో కూడా
చందానగర్ డివిజన్ లో నీటి సమస్య రాకుండా లైన్ మెన్లు అందరూ బాధ్యత తీసుకోవాలని చెప్పటం జరిగినది.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here