ఇప్పటికే చందానగర్ డివిజన్ లో 2000 మందికి పైగా వలస కార్మికులకు 12 కిలోల బియ్యం, 500 రూపాయలను అందచేసాం.
కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.
చందానగర్ డివిజన్ వేముకుంట ఉర్దూ మీడియం స్కూల్ లో వేముకుంట, ఇందిరా నగర్ తో పాటు ఇతర కాలనీలు, బస్తీలలో లాక్ డౌన్ సందర్భంగా పని లేకుండా ఇబ్బంది పడుతున్న వలస కార్మికులకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం,500 రూపాయలను ఎం.పీ. రంజిత్ రెడ్డి గారితో కలిసి పంపిణీ చేసిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.
ఎం.పి గారు మరియు కార్పొరేటర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి KCR గారి ఆదేశాల మేరకు వలస కార్మికులను అదుకుంటున్నాం అని, ఇప్పటి వరకు చందానగర్ డివిజన్ లో సుమారు 2000 మంది వలస కార్మికులకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, అనగా 250 టన్నుల బియ్యం మరియు 500 రూపాయలు అనగా 10 లక్షల రూపాయలు పంపిణీ చేసామని, ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే కూడా వారికి కూడా ఇస్తాం అని, డివిజన్ లో ఉన్న వలస కార్మికులను ఒక్కరిని కూడా ఆకలితో బాధపడకుండా చూసుకుంటాం అని చెప్పటం జరిగినది.
ఈ కార్యక్రమంలో రఘుపతి రెడ్డి, రవీందర్ రావు, గౌస్, జాహీరుద్దీన్, రాం, ధనరాజ్, రషీద్, గౌస్, మొయిజ్ తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్,
సౌత్ ఇండియా,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.