గౌరవ మంత్రి వర్యులు శ్రీ KTR దత్తత తీసుకున్న హైదర్ నగర్ డివిజన్ లో నిరుపేదలకు నిత్యావసరాల సరుకులు పంపిణీ చేసిన డివిజన్ తెరాస గౌరవ అధ్యక్షులు దామోదర్ రెడ్డి .

0
280

నిత్యావసర వస్తువుల పంపిణీ చేసిన 123 డివిజన్ గౌరవ అధ్యక్షులు దామోదర్ రెడ్డి.

గౌరవ మంత్రి వర్యులు శ్రీ KTR గారు దత్తత డివిజన్ అయిన హైదర్ నగర్ డివిజన్ లో ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు శ్రీ ఆరెకపూడి గాంధీ గారు మరియు హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ జానకి రామ రాజు గారి సూచనల మేరకు హైదర్ నగర్ డివిజన్ గౌరవ అధ్యక్షులు దామోదర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అడ్డగుట్ట ఋషి ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో కాలేజ్ అధినేత శివరాం ప్రసాద్ గారితో కలిసి నిరుపేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం శ్రీను, రమేష్, సుధాకర్ రెడ్డి,సుమన్ , రాము పాల్గొన్నారు.ఈ సందర్భంగా డివిజన్ గౌరవ అధ్యక్షులు మాట్లాడుతూ మే 29 వరకు lockdown ని అందరూ పాటించాలని అవసరమైతే తప్ప ఎవరూ బయటకి రావద్దని, మాస్క్స్ పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని తెలిపారు దామోదర్ రెడ్డి,తెరాస 123 డివిజన్ గౌరవ అధ్యక్షులు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here