MLA అరెకపూడి గాంధీ గారి ఆదేశాల మేరకు 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ముఖ్య కార్యకర్తలకు ఒక్కొక్కరికి 10Kg ల బియ్యం పంపిణీ చేశారు.

0
312

శేరిలింగంపల్లి సభ్యులు అరికెపూడి గాంధీ గారి ఆదేశాల మేరకు124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు ఈ రోజు మధ్యాహ్నం తన కార్యాలయంలో డివిజన్ లోని రాజీవ్ గాంధీ నగర్, తారక రామ్ నగర్, ఉజ్జయిని మహంకాళి నగర్, PJR నగర్ కి సంబంధించిన ముఖ్య కార్యకర్తలకు ఒక్కొక్కరికి 10 కేజీల బియ్యం అందజేయడం జరిగింది. తదనంతరం కార్పొరేటర్ గారు మరియు యువనేత రామకృష్ణ గౌడ్ కార్యకర్తలతో నాయకులతో కలసి భోజనం చేయడం జరిగింది. కార్పొరేటర్ గారు మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో నాతో ప్రయాణిస్తున్న ప్రతి కార్యకర్తలను నాయకులను ఆదుకుంటానని.. ఇదేవిధంగా డివిజన్ లోని మిగతా నాయకులకు కార్యకర్తలకు కూడా బియ్యం అందజేస్తానని తెలిపారు. కార్యక్రమంలో యువ నేత దొడ్ల రామకృష్ణ గౌడ్, చిన్నోల్ల శ్రీనివాస్, వార్డ్ మెంబర్ కాశీనాథ్ యాదవ్, బీసీ సెల్ అధ్యక్షులు రాజేష్ చంద్ర, బోయ కిషన్, శశి, పోశెట్టి గౌడ్, ఏరియా కమిటీ మెంబర్ వెంకటేష్, మీసాల జానయ్య, దర్గేశ్, మల్లేష్, బాలస్వామి, కటిక రవి, యాదగిరి, గుడ్ల శ్రీనివాస్, సాయి వర్ధన్ గౌడ్, నాగరాజ్, అర్జున్,యాదన్న, అశోక్, ఈశ్వర్, రాము, సాయి గౌడ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here