MLA గాంధీ గారు ,కార్పొరేటర్ హమీద్ పటేల్ గారి సూచన మేరకు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు అన్నం శశిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిత్యావసరాల సరుకుల పంపిణీ:

0
349

శేరిలింగంపల్లి : కొండాపూర్ : మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ గారి పిలుపు మేరకు ఏ పేద ప్రజలు కూడా ఆకలితో పస్తులు ఉండకూడదనే ఎమ్యెల్యే అరికెపూడి గాంధీ గారి సూచన మేరకు కరోనా కష్ట కాలంలో వారికి తోడుగా, వారికి అండగా, నిరుపేదలను ఈ కష్ట కాలంలో ఆదుకోవాలని దృఢ సంకల్పంతో జీహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్, కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ గారి సహకారంతో ఈ రోజు రాజరాజేశ్వరి కాలనీలోని లా కన్వెన్షన్ ఫంక్షన్ హల్ నందు, టీఆరెస్ సీనియర్ నాయకులు అన్నం శశిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 400 మందికి బియ్యం తో పాటుగా నిత్యావసర సరుకులు ప్యాకెట్ కిట్లను పంపిణీ చేయుట జరిగింది.

ఈ కార్యక్రమంలో కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ గారితో బాటుగా టీఆరెస్ సీనియర్ నాయకులు అన్నం శశిధర్ రెడ్డి గారు, వార్డు మెంబర్స్ చాంద్ పాషా, నిర్మల, కొండాపూర్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ యాదవ్, ఏరియా కమిటీ మెంబర్ హిమామ్, ఫారూఖ్, అడ్వకేట్ ఆవుల శ్రీరాములు, అడ్వకేట్ ఆవుల కృష్ణవేణి, రమేష్ ముదిరాజ్, మధు ముదిరాజ్, శృతి, అబేద్ అలీ, రఫియా, పుణ్యవతి, పాస్టర్ జర్మయ్య, సంజీవ, పర్వీనా, యూత్ నాయకులు దీపక్ తదితరులు పాల్గొన్నారు.

Nalla Sanjeeva Reddy
Telangana State
Bureau Chief
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here