National Anti Corruption News Channel

0
371

WHO(ప్రపంచ ఆరోగ్య సంస్థ) స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా డాక్టర్ శ్రీనాథ రెడ్డి నియామకం💐💐

స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా నియమించిన WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్.

ప్రపంచవ్యాప్తంగా కరోనా చికిత్స కు జరిగే పరోశోధనలు ఈ కమిటీ పర్యావేక్షిస్తూ సలహాలు ఇస్తూ మార్గదర్శనం చేస్తుంది.

భారతీయ ప్రజారోగ్య సంస్థ చైర్మన్ గా (public Health Foundation of india) ఉన్న శ్రీనాథ రెడ్డి హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో MBBS చదివి, AIIMS ఢిల్లీ లో కార్డియాలజీలో MD చదివారు. పలు అంతర్జాతీయ, జాతీయ పరిశోధన సంస్థలకు, ప్రభుత్వాలకు సలహా దారుగా, ప్రఖ్యాత అంతర్జాతీయ యూనివర్సిటీ లకు విజిటింగ్ professor గా సేవలందిస్తున్నారు.

శ్రీనాథ రెడ్డి సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 2005 లో “పద్మభూషణ్”తో గౌరవించింది, WHO 2003 లో అవార్డుతో గౌరవించింది, లండన్ రాయల్ సొసైటీ నుండి “క్వీన్ ఎలిజబెత్” అవార్డ్ తో సత్కరించబడ్డారు. ఇలాంటి ఎన్నో అవార్డ్స్ వివిధ దేశాల నుండి అందుకున్నారు.

డాక్టర్ శ్రీనాథ రెడ్డి సభ్యుడుగా ఉన్న స్టీరింగ్ కమిటీసూచనల తో కరోనాపై విజయం సాధిస్తామని ఆశిద్దాం.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్& ఇంచార్జి సౌత్ ఇండియా
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here