National Anti Corruption News Channel

0
240

Serilingampally, June 01: ఆదివారం ఈదురు గాలులతో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా పాపిరెడ్డి కాలనీ, వాంబే బిల్డింగ్ సముదాయం వద్ద పెద్ద పెద్ద వృక్షాలు, విద్యుత్ స్తంబాలు నేలమట్టం కావడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ విషయం తెలుసుకుని హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి అప్పటికప్పుడు ఎలక్ట్రికల్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్ )సిబ్బందికి సమాచారం అందించి సమస్య పరిష్కారానికి‌ కృషి చేశారు. ఎస్ ఈ వెంకన్న, డీఈ నర్సింహా రెడ్డి తో అన్ని సంఘటనా ప్రాంతాలను పర్యవేక్షించి పడిపోయిన విద్యుత్ స్తంబాలను, చెట్లను ఆయా శాఖలను సమన్వయపరుస్తూ తొలగింపజేశారు.

ఆయన వెంట టీఆర్ఎస్ పార్టీ డివిజన్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్, ఉపాధ్యక్షులు కుంచాల రమేష్, పద్మారావు గౌడ్, వార్డు మెంబర్లు శ్రీకళ, పొడుగు రాంబాబు, బస్తీ కమిటీ అధ్యక్షుడు రమణ, నాయకులు కొండల్ రెడ్డి, రవీందర్, రజిని, యోగి, శ్రీహరి తదితరులు ఉన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here