శేరిలింగంపల్లి NAC JUNE 03:తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి జన్మదిన శుభ సందర్భంగా కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కొరోనా మహమ్మారి తో పోరాటంలో తమ కుటుంబాలను సైతం లెక్కచేయకుండా, ప్రాణాలను సైతం పణంగా పెట్టి డివిజన్ లో గల గర్భిణీ స్త్రీలు ఏ రకమైన ఇబ్బంది పడకుండా ఎవ్వరూ కూడా అనారోగ్యానికి బలి కాకుండా సేవలు అందిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు ఈరోజు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఎంబిబిఎస్, ఎల్లమ్మ బండ బస్తి దావఖాన ప్రధానాధికారి డాక్టర్ మౌనిక ఎంబిబిఎస్ గార్లతో పాటు వారి మొత్తం వైద్య సిబ్బందితో కలిసి భోజనం చేసి, ప్రతి ఒక్కరికి శాలువాతో సత్కరించి వారికి మాస్కులు మరియు పండ్లు అందజేయడం జరిగింది.
కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, జర్నలిస్టులు ఎం ఏ కరీం, బుల్లెట్ రవి, వార్డ్ మెంబర్ కాశీనాథ్ యాదవ్, బోయ కిషన్, దుర్గేష్, పోశెట్టి గౌడ్, బీసీ సెల్ అధ్యక్షులు రాజేష్ చంద్ర, కాసాని శంకర్, పాలడుగు జానయ్య, గుడ్ల శ్రీనివాస్, అర్జున్, నాగరాజు, సంతోష్ బిరాధర్ తదితరులు పాల్గొన్నారు.
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL