National Anti Corruption News Channel

0
194

శేరిలింగంపల్లి, అక్టోబర్ 28: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ గారిని పోలీసులు దాడి చేసి, అక్రమ అరెస్టు చేసినందుకు, తీవ్ర నిరాసనగా తెరాస ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమానికి వెళ్ళనివకుండా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ ను మియపూర్ పరిధిలోని ఇందిరారెడ్డి ఆల్విన్ కాలనీ తన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చైయడం జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సిద్దిపేటలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి అరెస్టును బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ తీవ్రంగా ఖండిస్తున్నా అని అన్నారు.ఒక ఎంపీ అన్న కనీస మర్యాద లేకుండా పోలీసులు భౌతికదాడి చేయడం, పోలీసు వాహనంలో తోసేయడం టీఆర్ఎస్ నియంతృత్వ, నిరంకుశ పాలనకు పరాకాష్ట అని అన్నారు.దుబ్బాకలో ఓటమి భయంతో బిజెపిపై దాడులు, నిర్బంధాలు అని అన్నారు.ప్రజాస్వామ్య బద్దంగా బీజేపీని ఎదుర్కొనే దమ్ము లేక ప్రభుత్వం అభ్యర్థి రఘునందన్ రావు గారితో పాటు ప్రజలను కూడా భయ బ్రాంతులకు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి అభ్యర్థి బంధువుల ఇళ్లలో పోలీసులు మరియు అధికారులు దాడులు చేయించడం అసత్య ప్రచారాలకు పాల్పడటం సిగ్గు చేటు అని అన్నారు.దుబ్బాక బిజెపి అభ్యర్థి రఘునందన్ రావును పరామర్శించేందుకు వెళ్తోన్న బండి సంజయ్ కుమార్ ను అరెస్ట్ చైయడం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేక నిజాం నిరంకుశత్వ పాలన కొనసాగుతుందా అని అన్నారు.అరెస్టులు, బెదిరింపులు బిజెపిని భయపెట్టలేవు. టీఆర్ఎస్ ఎన్ని అరచాకాలకు పాల్పడిన దుబ్బాకలో బిజెపి విజయం ఖాయం అని అన్నారు.కేంద్రలో అధికార గల జాతీయ పార్టీ రాష్ట్రంలోనే 30లక్షలపై చిల్లుకు సభ్యత్వం ఉన్న గల పార్టీ అని అన్నారు.ఒక పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని దాడి చేసి అరెస్ట్ చేయడం టిఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గు చేటు అని అన్నారు. వెంటనే సీపీని సస్పెండ్ చేసి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here