శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీ వద్ద వలస కార్మికులకు నిత్యావసర సరుకులకు ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ & వివేకానంద సేవ సమితి గౌరవ అధ్యక్షుల సహకారంతో 40 మంది కుటుంబాలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ గారు పాల్గొని పేదలకు నిత్యావసర వస్తువులను అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కాంతరావు, బిజెపి నాయకులు గోపి, నరేందర్ రెడ్డి, శ్రీకర్, కేశవ్ రావు, విజిత్, కుమార్, పర్వతల్ యాదవ్, భూపాల్ రెడ్డి, వినోద్,శివ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.