ఆల్విన్ కాలని 124 డివిజన్ లోని ఎల్లమ్మ బండ ఖాజానాగర్ కంటోన్మెంట్ జోన్ నుండి తొలగిపోయి ఖాజానగర్ కాలనిలో నివసించే మహబూబ్ అలీ కి నెగటివ్ వచ్చిన శుభ సందర్భంగా స్తానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు వారి ఇంటికి వెళ్లి కలిసి వారిని వారు కుటుంబాన్ని పలకరించి ఫ్రూట్స్ అందజేయడం జరిగింది. మహబూబ్ అలీకి పూర్తిగా నయం అయిపోయి నెగటివ్ వచ్చినందుకు కార్పొరేటర్ గారు హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా సామాజిక దూరాన్ని పాటించి కొరోనా మహమ్మారిని సంపూర్ణంగా మన దరికి రాకుండా చేయాలని కోరారు. నిత్యవసర వస్తువులు తీసుకోవడానికి బయటికి వచ్చినప్పుడు మాస్కు తప్పనిసరిగా ధరించాలి అని కోరారు. లాక్ డౌన్ పూర్తయ్యేవరకు ఎల్లవేళలా ఖాజా నగర్ ప్రజలకు మరియు డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ తన శాయశక్తూలా ఆదుకుంటానని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ లింగం , యువ నాయకులు దొడ్ల రామకృష్ణ గౌడ్, రిపోర్టర్ బుల్లెట్ రవి,నాయకులు సమద్, గుడ్ల శ్రీనివాస్, రామ్ చందర్, కటిక రవి, సంపత్ గారితో పాటు తదితరులు పాల్గొన్నారు.
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.