PJR స్టేడియంలో ప్రతి ఆదివారం, పది గంటలకు, పది నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్న యంపి డాక్టర్ జి రంజిత్ రెడ్డి గారు,ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ గారు.

0
170

గౌరవ మంత్రి వర్యులు శ్రీ కేటీఆర్ గారి పిలుపు మేరకు దోమల ద్వారా వ్యాప్తి చెందే సీజనల్ వ్యాధుల నివారణ కోసం “ప్రతి ఆదివారం పది గంటలకు, పది నిమిషాలు” కార్యక్రమంలో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని PJR స్టేడియం లో శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ గారితో కలిసి ప్రజలకు అవగాహన కలిపిస్తూ, నిల్వ ఉన్న నీటిని తొలగించి, శుభ్రం చేసిన చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్ జి. రంజిత్ రెడ్డి గారు. ఈ సందర్బంగా రంజిత్ రెడ్డి గారు మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధుల నివారణ చర్యల్లో భాగంగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 10 నిమిషాల పాటు ప్రజలు తమ ఇండ్లను, పరిసరాలను శుభ్రపర్చుకోవాలని ‌‌‌‌‌ తెలియజేసారు. అదేవిధంగా ఇందులో భాగంగా ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని మరియు నీటి నిల్వ డ్రమ్ములు మరియు కూలర్ లో వారంలో ఒకసారి పూర్తిగా నీళ్లు తీసేసి శుభ్రం చేసుకొని వాడుకోవాలని తద్వారా సీజనల్ వ్యాధులు మరియు దోమల నివారణకు సాధ్యమవుతుంది అని అదేవిధంగా మలేరియా , డెంగ్యూ, చికెన్ గున్యా , ఫైలేరియా, మెదడువాపు తదితర సీజనల్ వ్యాధుల నివారణ కోసం ఇప్పటి నుంచే ప్రజలు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని. రాబోయే వర్షా కాలంలో ఎలాంటి రోగాలు రాకూడదంటే ఇప్పటి నుండే మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని అందుకు ప్రతి ఒక్కరూ తమ సొంత గృహాలు, తమ పరిసరాల పారిశుద్ధ్యం, పరిశుభ్రత పైన దృష్టి సారిస్తే సీజనల్ వ్యాధులను ఎదుర్కొనే అవకాశం ఉందని రంజిత్ రెడ్డి గారు అన్నారు. ఇంట్లో చెత్తను మోరీల్లో వేయకూడదు అని ఇంటి ముందుకొచ్చే మున్సిపల్ చెత్త బండికి అందచేయాలి అని. ముఖ్యంగా దోమల నుంచి రక్షించుకోవడం కోసం ఇంటినీ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాల అవసరం అని డెంగ్యూ దోమ లార్వాలు మంచినీటిలో పెరుగుతాయి కాబట్టి మన పరిసరాల్లో నీరు చేరకుండా చూసుకోవాలి.ఇళ్లు, పరిసరాల్లో పాత టైర్లు, ఖాళీ కొబ్బరి బొండాంలు, కాఫీ, టీల కోసం వాడి పారేసే ప్లాస్టిక్‌ కప్పులు ,పాత కూలర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, ఇంటిముందు ఉండే రోళ్లు, ఇంటి ముందు నీటి గుంతలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని ప్రజలకు అవగాహన కలిపించారు . అదేవిదంగా పారిశుద్ధ్య కార్మికులను గౌరవించడం మన బాధ్యత అని శానిటేషన్‌ విషయంలో రాష్ట్రానికి మంచి పేరు వచ్చిందని, దాన్ని కాపాడుకోవాలని కరోనా వైరస్‌వ్యాప్తి నివారణ చర్యల్లో ముందుండి సేవలందించిన పారిశుద్ధ్యకార్మికులను గౌరవించడం అందరి కనీస బాధ్యత అన్నారు. కరోనాతో మరికొంత కాలం కలిసి బతకాల్సిందేనని, వైరస్‌వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతోపాటు భౌతికదూరం తప్పక పాటించాలని, శానిటైజర్లను ఉపయోగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రఘుపతి రెడ్డి, సునీత రెడ్డి , చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి , హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్, తెరాస నాయకులు మిర్యాల రాఘవరావు, ఉరిటి వెంకట్రావు, దాసరి గోపి కృష్ణ, జేరిపాటి రాజు, వాలా హరీష్ రావు, గురు చరణ్ దూబే ,రవీందర్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

Nalla Sanjeeva Reddy
Bureau Chief
Telangana State
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here