Telangana:కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ దాతలకు పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు:

0
516

Telangana: కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ దాతలకు పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు..

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రోజు వారీ కూలీల ఆకలిని తీరుస్తున్న దాతలకు ధన్యవాదాలు..
శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
రోజు వారీ కూలి పనులు చేసుకొని బతికే కుటుంబాలకు కరోనా వైరస్ తీవ్ర ప్రభావితం చూపిస్తుందని,ఇతర రాష్ట్రాల నుంచి కూలి పనులకు వచ్చిన కార్మికులకు,నిరుపేద కుటుంబాలకు ఎంతో మంది దాతలు వారికి తోచిన విధంగా నిత్యావసర వస్తువుల,రోజు కొన్ని భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానమెట్ గ్రామంలో స్థానిక టిఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీ.జయరాజ్ యాదవ్ గారు సుమారు 200మందికి బియ్యం,పప్పు,నూనె,ఉప్పును అందించారు..
హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని యూత్ కాలనీ నందు బస్తి అధ్యక్షులు శ్రీ.సయ్యద్ తాహెర్ హుస్సేన్ గారు బస్తీలో నివాసముండే సుమారు 200మందికి భోజన ఏర్పాట్లు చేయడం జరిగిందని,ప్రజల కోసం ముందుకు వచ్చి వారికి తోచిన విధంగా సహాయం చేయడం చాలా సంతోషంగా ఉందని వారిని అభినందించారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
అనంతరం గంగారాం,సుభాష్ నగర్ మరియు కొండాపూర్ వికర్ సెక్షన్ బస్తీలో* నివాసముండే నిరుపేద కుటుంబాలకు కార్పొరేటర్ గారు నిత్యావసర సరుకుల మరియు బియ్యం అందించారు.. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు శేఖర్ ముదిరాజ్,రవి కుమార్,శ్యామ్,సర్వర్,సతీష్ యాదవ్,సంజు యాదవ్,లోకేష్,సాబేర్,సుదేశ్,జామీర్,తైలిగిరి తదితరులు పాల్గొన్నారు..

నల్లా సంజీవ రెడ్డి
చీఫ్ బ్యూరో, సౌత్ ఇండియా
ఎన్ ఏ సి న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here