TELANGANA మొబైల్ రైతు బజార్ల ఏర్పాటు సమావేశంలో ప్రకటన నల్లగొండ.

0
192

Telangana
మొబైల్ రైతు బజార్ల ఏర్పాటు సమావేశంలో ప్రకటన
నల్లగొండ.

బత్తాయి నిమ్మ రైతులు తమ పంట అమ్ముకోవటానికి మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ప్రశాంత జీవన్ పాటిల్ తెలిపారు ఆయన ఎస్పీ రంగనాథ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తో కలిసి రైతులు వ్యాపారులు కమీషన్ ఏజెంట్ల తో సమావేశమయ్యారు జిల్లాలో బత్తాయి 44 వేల మెట్రిక్ టన్నులు నిమ్మ మరో 52 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి రానున్నట్లు తెలిపారు మన పండ్లు మనమే తినాలన్నా సీఎం కేసీఆర్ సూచనల మేరకు రైతు బజార్ లను ఏర్పాటుచేసి పండ్ల విక్ర యాలకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ముందుగా నల్గొండ తర్వాత మిర్యాలగూడలో ఈ పండ్ల విక్రయాలు చేపట్టేలా ఉద్యాన మార్కెటింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ కూలీల రవాణాకు పాసులు జారీ చేస్తామన్నారు మన రాష్ట్రంలో అవసరం తీరాకే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాలని ట్రేడర్లకు సూచించారు.

యండి షఫీ
మిర్యాలగూడ రిపోర్టర్
ఎన్ ఏ సి న్యూస్ చానల్.