National Anti Corruption And Operation Committee of India. NACOCI. ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు సంతోష్ కుమార్ సరిదేన:
సంతోష్ కుమార్ మరియు బాల్య మిత్రులు కలిసి ఈ రోజు పోలీసు సోదరులకు, వలస కూలీలకు,నిరుపేదలకు దాదాపు 250 మందికి సాంబారు, భోజనం, పండ్లు,వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
సంతోష్ కుమార్ సరిదేన మాట్లాడుతూ తన బాల్య మిత్రులు కూడా తనకు తోడుగా ఒక మంచి కార్యక్రమానికి సహకారం అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని వారికి ధన్యవాదాలు తెలిపారు.
రేపు కూడా తన చిన్న నాటి స్నేహితుల సహకారంతో ఈ భోజనాలు, పండ్లు,వాటర్ 300 మందికి పంపిణీ చేస్తామని సంతోష్ కుమార్ సరిదేన తెలిపారు.
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
ఎన్ ఏ సి న్యూస్ చానల్.