TRS నాయకులకు, కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: గంగ లక్ష్మా రెడ్డి శేరిలింగంపల్లి, TRS నాయకులు.

0
764

స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా, మహాజ్వాలిత ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన మహోన్నతుడు తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ అని, ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా ఆవిర్భవించి విజయాల పరంపర మోగిస్తోందని శేరిలింగంపల్లి TRS నాయకులు గంగ లక్ష్మా రెడ్డి అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ 20 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. నీళ్లు, నిధులు, ఉద్యోగ ఉపాధి వేటి కోసమైతే ప్రత్యేక రాష్ట్రం కావాలానుకున్నామో వాటన్నింటిని కేసీఆర్ సారథ్యంలో సాధించుకోవడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి బలమైన సిద్దాంత పార్టీగా పేరుగాంచిందన్నారు. కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరిగిందన్నారు. ఈ సందర్భంగా నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా,నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here