TRS సీనియర్ రాష్ట్ర నాయకులు కొమాండ్ల శ్రీనివాస్ రెడ్డి పంపిణీ:

0
144

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలను ఆ మహమ్మారి బారిన పడకుండా కాపాడడం కోసం లాక్ డౌన్ ను విధించడం జరిగింది. ఈ స్థితిలో దాత TRS సీనియర్ రాష్ట్ర నాయకులు కొమాండ్ల శ్రీనివాస్ రెడ్డి పేదలను పస్తులండకుండా ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో గత కొద్ది రోజుల నుండి రక రకాలుగా వితరణ చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజు 300 మందికి కేజీ మసాలా రైస్ పంచడం జరిగింది, రెడ్డి కాలనీ వీకర్ సెక్షన్, రాజేందర్ రెడ్డి నగర్ కాలనీ వికర్ సెక్షన్, చందానగర్, మియాపూర్ ట్రాఫిక్ పోలీస్, మరియు కొత్తగూడ పోలీస్ సోదరులకు అంద చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కోమాండ్ల శ్రీనివాస్ రెడ్డి, చందానగర్ తెరాస ప్రెసిడెంట్ రఘనాథ్ రెడ్డి మరియు ధీరజ్ కుమార్, విజయ్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు…

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.